రాజకీయ విరామం తీసుకోవాల్సిన సమయం వచ్చింది: మల్లికార్జున ఖర్గేపై రామచందర్ రావు సెటైర్లు

  • ఖర్గే రాహుల్ గాంధీ కనుసన్నల్లో నడుస్తున్నాడన్న రాంచందర్ రావు
  • వయసు రీత్యా రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్ అని ఎద్దేవా
  • కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్య

ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రధాని మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామంపై తెలంగాణ బీజేపీ నేత రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. ఖర్గే గా తన సొంత నిర్ణయాలతో కాకుండా, పూర్తిగా రాహుల్ గాంధీ కనుసన్నల్లోనే నడుస్తున్నారని ఆయన ఆరోపించారు. వయసు రీత్యా ఆయన రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం ఉత్తమమని, ఆయన చేసే ప్రతి తప్పుడు ప్రకటనకు రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రజలే రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.


మరోవైపు, నేడు పశ్చిమ బెంగాల్ లోక్‌సభ తొలి దశతో పాటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బెంగాల్ ఓటర్లు ఎటువంటి భయం లేకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాంచందర్ రావు కోరారు. ఎన్నికల సంఘం అక్కడ పటిష్ఠమైన భద్రత కల్పించిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మే 4న వెలువడబోయే ఫలితాలు ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి సానుకూలమైన భారీ మార్పును తీసుకువస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


Ramchander Rao
BJP
Mallikarjun Kharge
Congress

More Telugu News